సూర్యుడివో చంద్రుడివో...

మహేశ్‌బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని రెండో పాటని సోమవారం విడుదల చేశారు చిత్రబృందం. ‘సూర్యుడివో చంద్రుడివో...’ అనే పల్లవితో సాగే ఈ పాట ఫ్యామిలీ మెలోడీగా అలరిస్తోంది. మహేశ్‌బాబు, రష్మికా మందన్నా జంటగా విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా జనవరి 11 విడుదలవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించిన ‘సూర్యుడివో చంద్రుడివో...’ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటని ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి.ప్రాక్ పాడారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘సూర్యడివో...’ పాట ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు’’ అన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి