నేను చాలా లక్కీ

shruthi hasan answers on her fans quastions - Sakshi

కమాన్‌... ఎవరేం అడగాలనుకున్నా అడిగేయండి.. జవాబు చెబుతా అంటూ అభిమానులకు శ్రుతీహాసన్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో తన ఫాలోయర్స్‌ కోసం కొంత టైమ్‌ కేటాయించారామె. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా జవాబులు చెప్పారు. ఆ కొంటె ప్రశ్నలు, శ్రుతీ చెప్పిన సరదా సమాధానాలు ఇలా..

► కొత్త సంవత్సరం (2020)లో మీకు మీరు చేసుకున్న ప్రామిస్‌?
సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవాలి. అనవసరమైన ఆలోచనలకు అడ్డుకట్ట వేయాలి. బాగా కష్టపడాలి.

► మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలనుకునేవారికి ఏం చెబుతారు?
కొన్ని రూల్స్‌ పెట్టుకోండి. లక్ష్యం కోసం బాగా కష్టపడండి. మీ ఆలోచనలు, నిర్ణయాల్లో జాలికి కాస్త చోటివ్వండి.

► మీ ఆప్తమిత్రుడి పేరు చెప్పండి?
చాలామంది ఉన్నారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని.

► విహారయాత్రకు వెళ్లడానికి ఏ ప్రదేశాన్ని ఎక్కువగా ఇష్టపడతారు?
 లండన్‌.

► మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం?
నాకు పాములంటే చాలా భయం.

► మీ బరువు?
62 కేజీలు.

► ► మీరు మెచ్చిన హాలీవుడ్‌ చిత్రం?
గాడ్‌ఫాదర్‌.

► మీరు ఏ బ్రాండ్‌ కారును ఇష్టపడతారు?
పనిచేసే అన్ని బ్రాండ్ల కార్లు ఇష్టమే (సరదాగా)

► చాక్లెట్‌ లేదా ఐస్‌క్రీమ్‌?
ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టం.

► బ్జీ గేమ్‌ ఆడతారా?
ఆడను.

► నిద్రపోయే ముందు పాలు తాగే అలవాటు ఉందా?
లేదు.

► మీ నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ ఇవ్వగలరా?
నాకు గుర్తులేదు (నవ్వుతూ)

► ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమాలు?
తెలుగులో రవితేజ ‘క్రాక్‌’, తమిళంలో విజయ్‌ సేతుపతి ‘లాభం’ సినిమాలు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top