పదిరోజుల్లో రూ.50 కోట్లు

Shubh Mangal Zyada Saavdhan Movie Collect Rs 50 Crores - Sakshi

ఆయుష్మాన్‌ ఖురానా, జితేంద్ర కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శుభ్‌ మంగళ్‌ జ్యాద సావధాన్‌’. ఇద్దరబ్బాయిల మధ్య ప్రేమ.. అంటూ కొత్త కాన్సెప్ట్‌తో తరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదలైంది. దీని ట్రైలర్‌ విషయానికొస్తే.. హీరోలిద్దరూ ఓ పార్టీలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే, అందులో తప్పేముంది అన్నట్లుగా వాళ్లు ప్రవర్తించే తీరు మాత్రం ప్రేక్షకులకు తప్పకుండా నవ్వు తెప్పిస్తుంది. ఇక ట్రైలర్‌లోనే నవ్వులు పూయించిన దర్శకుడు హితేశ్‌ కేవాల్యా సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించడంలో సఫలీకృతమయ్యాడు. (రాహు మూవీ రివ్యూ చదివేయండి)

ఈ సినిమాలో నీనా గుప్తా, గజరాజ్‌ రావు, సునీతా రాజ్‌వార్‌, మను రిషి చద్దా, మాన్వీ గగ్రూ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలైన తొలినాడే రూ.9.55 కోట్ల కలెక్షన్లతో గ్రాండ్‌ ఓపెనింగ్స్‌ సాధించింది. థియేటర్లలో దూకుడు ప్రదర్శించిన ఈ సినిమా ఆదివారం మూడున్నర కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లతో కలుపుకుని పదిరోజుల్లోనే రూ.50 కోట్ల మైలురాయిని అవలీలగా దాటేసింది. కాగా దీని వసూళ్ల పర్వానికి ఫిబ్రవరి 28న విడుదలైన తాప్సీ ‘థప్పడ్‌’ చిత్రం అడ్డుకట్ట వేసింది. అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రశంసలు కురిపిస్తుంటే మరో వర్గం మాత్రం విమర్శలు గుప్పిస్తోంది.(థప్పడ్‌ మూవీ రివ్యూ)

ఆయుష్మాన్‌ ఖురానా సినిమాపై ట్రంప్‌ ట్వీట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top