సుమధుర గాయకుడికి బర్త్‌డే విషెస్..

ట్విటర్లో ట్రెండింగ్
సాక్షి, హైదరాబాద్ : లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 73వ బర్త్‌డే సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన అభిమానులు శుభాకాంక్షలతో హోరెత్తించారు. అభిమాన గాయకుడికి పలువురు ప్రముఖులు, అభిమానులు పెద్దసంఖ్యలో శుభాకాంక్షలు తెలుపడంతో ట్విటర్ టాప్ ట్రెండ్స్‌లో నిలిచింది. బాలుగా పేరొందిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వేలాది పాటలకు సుమధుర గాత్రంతో ప్రాణం పోశారు.
తన సుదీర్ఘ కెరీర్లో ఆయన ఆరు జాతీయ ఫిల్మ్ అవార్డులు, 25 సార్లు ఏపీ ప్రభుత్వ నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును, ఆరు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఇక 2001లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు, 2011లో పద్మవిభూషణ్ అవార్డు ఆయనను వరించాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి