ప్రియుడిని పెళ్లాడిన ‘మామ్‌’ నటి

Sridevi MOM Movie Co Star Sajal Ali Wedding Pics Goes Viral - Sakshi

ముంబై: పాకిస్తాన్‌ నటి సజల్‌ అలీ తన చిరకాల మిత్రుడు, సహ నటుడు అహద్‌ రజా మీర్‌ను వివాహమాడారు. ఇటీవలే వీరి పెళ్లి వేడుక అబుదాబిలో ఘనంగా జరిగింది. నిఖా సందర్భంగా ఎరుపు రంగు లెహంగాలో వధువు సజల్‌ మెరిసిపోగా... తెలుపు రంగు కుర్తా ధరించిన రజా మీర్‌ హుందాగా కనిపించాడు. కాగా ఓ టీవీ షోలో కలిసి నటించిన వీరిద్దరు ప్రేమలో పడ్డారు. 2019 జూన్‌లో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగగా తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను సజల్‌.. ‘హెల్లో.. మిస్టర్‌ మీర్‌’  అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 

ఇక సజల్‌ అలీ.. ‘మామ్‌ చిత్రంలో బాలీవుడ్‌ తెరపై తళుక్కుమన్న సంగతి తెలిసిందే. తన సవతి కూతురి(సజల్‌ అలీ)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులపై ప్రతీకారం తీర్చుకునే పాత్రలో దివంగత, లెజెండ్‌ శ్రీదేవి నటించగా.. ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సజల్‌కు మంచి గుర్తింపు లభించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top