కారును తోస్తూ కసరత్తులు చేస్తున్న యంగ్ హీరో

సమ్మోహనం సినిమాతో కూల్ హిట్ కొట్టిన సుధీర్ బాబు.. నన్ను దోచుకుందువటే చిత్రంతో పలకరించాడు. ప్రస్తుతం సుధీర్ బాబు.. ప్రయోగాత్మక చిత్రాలను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ బయోపిక్‌ను రూపొందించే పనిలో పడ్డాడు. స్వతహాగా బ్యాడ్మింటర్ ప్లేయర్ కావడంతో కొంచెం ఈజీ అయినా.. ఆ పాత్రకోసం సుధీర్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
సుధీర్ బాబు కసరత్తులు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారును ముందుకు తోస్తూ చాలా కష్టపడుతున్నాడు. పక్కనే ట్రైనర్ ఉండి సలహాలు ఇస్తున్నాడు. హైవేపై కారును తోస్తున్న సుధీర్.. తన శరీరాకృతిని మార్చుకునేందుకు భారీ కసరత్తులు చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వీ’ చిత్రంలో నటిస్తున్నాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి