మరోసారి పోలీస్ పాత్రలో!

ఈ జనరేషన్ హీరోలు మల్టీస్టారర్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న నాని కూడా ఇటీవల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరో నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమాలో నటించిన నాని, ప్రస్తుతం సుధీర్ బాబుతో కలిసి మరో సినిమా చేస్తున్నాడు.
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చారు సుధీర్ బాబు. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో తాను పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పోలీస్ పాత్రలో కనిపించి సుధీర్ బాబు మరోసారి అదే లుక్‌లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లోనూ నటిస్తున్నట్టుగా తెలిపారు.
Elated to be working with 2 national award winners @mokris_1772 & @PraveenSattaru. #VTheFilm & #PullelaGopichand are exciting scripts with me playing a Police & Sports Legend. Will update again once I confirm the things in discussion. Love ur concern, queries & suggestions 😊😬🤗
— Sudheer Babu (@isudheerbabu) July 19, 2019
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి