థాయిలాండ్ నుంచి ‘వ్యూహం’ కదిలింది!

సమ్మోహనం లాంటి కూల్ హిట్ కొట్టిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. మరోసారి తనదైన శైలితో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ దర్శకుడు.. ఓ కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించిన సంగతె తెలిసిందే. సుధీర్‌బాబు, నాని కాంబినేషన్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ ‘వీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రంలో నాని నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ఈమేరకు సుధీర్ బాబు ఓ ట్వీట్ చేశాడు. వెన్నెల కిషోర్, ఇంద్రగంటి, దిల్‌రాజు,సుధీర్ అందరూ కలిసి ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నివేదా థామస్, అదితిరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
And that's pack up from the #Phuket schedule ... Happy faces should tell you how good this turned out to be 😎☺ #VTheMovie pic.twitter.com/0xgLJG52pM
— Sudheer Babu (@isudheerbabu) September 26, 2019
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి