పాట విని మాట రాలేదు

Sukumar Daughter Sukriti Bandreddi Singing Song - Sakshi

జనవరి 22తో సుకుమార్‌ కుమార్తె సుకృతికి పదేళ్లు నిండాయి. ఈ సందర్భంగా సుకృతి పాడిన ఓ పాటను విడుదల చేశారు దర్శకుడు సుకుమార్‌. విశేషం ఏంటంటే సుకుమార్‌ పుట్టిన రోజు (జనవరి 11) సందర్భంగా సుకృతి ఈ పాటను పాడి, తండ్రికి బహుమతిగా ఇచ్చింది. ఆ పాటనే సుకృతి బర్త్‌డే రోజు విడుదల చేశారు సుకుమార్‌. ‘‘నా పుట్టినరోజు కోసం నా కూతురు పాడిన పాట వినగానే నాకు ఆనందంతో మాట రాలేదు. ఎంతో భావోద్వేగా నికి లోనయ్యాను. ççసుకృతి ప్రతిభ, సంగీతంపై తనకున్న ఇష్టం ఈ పాట వింటే తెలుస్తుంది’’ అన్నారు సుకుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top