‘చట్టబద్ధంగా భార్యను చేసుకున్నా’

Sushmita Sen Brother Rajeev Sen Married Charu Asopa - Sakshi

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. తన స్నేహితురాలు, టీవీ నటి అయిన చారు అసోపాను చట్టబద్ధంగా(కోర్టు మ్యారేజీ) పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో పూర్తి నిరాడంబరంగా వీరి పెళ్లి జరగడం విశేషం. ఈ విషయాన్ని రాజీవ్‌ సేన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘నేను.. రాజీవ్‌ సేన్‌.. చారు ఆసోపాను చట్టబద్ధంగా భార్యను చేసుకున్నా’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెళ్లి ఫొటోలను షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ఈరోజుల్లో.. అన్ని అవకాశాలు ఉండి ఇంత నిరాండబరంగా పెళ్లి చేసుకున్న మీ జంట నిజంగా ఆదర్శనీయం’ అంటూ నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

కాగా బుల్లితెర నటిగా గుర్తింపు పొందిన చారు అసోపా పలు హిందీ సీరియళ్లలో నటించారు. తర్వాత బాలీవుడ్‌లో కూడా ప్రవేశించి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత ఏడాది కాలంగా తనతో డేటింగ్‌ చేస్తున్న రాజీవ్‌ సేన్‌ను కోర్టు మ్యారేజీ ద్వారా జూన్‌ 7న పెళ్లి చేసుకున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించారు. పెళ్లి సందర్భంగా భర్త, అత్తగారితో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. కాగా రాజీవ్‌ సేన్‌ మోడల్‌ అన్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top