కరోనా దగ్గర చేసింది!

Sussanne Khan moves in with ex-husband Hrithik Roshan to co-parent sons - Sakshi

‘సామాజిక దూరం పాటించండి... కరోనాని నియత్రించండి’ అనే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇలా కరోనా అందరినీ విడదీస్తోంది. కానీ విడివిడిగా ఉంటున్న హృతిక్‌ రోషన్, ఆయన భార్య సుజానే ఖాన్‌ని ఒకే ఇంట్లో ఉండేలా చేసింది. విషయం ఏంటంటే... హృతిక్, సుజానే విడిపోయి ఆరేళ్లు పైనే అయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి దగ్గర కొన్నాళ్లు, తండ్రి దగ్గర కొన్నాళ్లు పిల్లలు ఉంటారు. పండగలు, పార్టీలను భార్యాభర్తలిద్దరూ పిల్లలతో సెలబ్రేట్‌ చేసుకుంటారు.

ఇప్పుడు హృతిక్‌ దగ్గరే పిల్లలు ఉన్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ వల్ల పిల్లలు, హృతిక్‌ బయటకు వెళ్లడంలేదు. దాంతో పిల్లలను సుజానే మిస్‌ అవుతున్నారు. ఈ సమయాన్ని పిల్లలతో గడపాలనుకున్న ఆమె సూట్‌కేస్‌ సర్దుకుని మాజీ భర్త హృతిక్‌ ఇంటికి వెళ్లిపోయారు. ‘‘పిల్లలతో గడపాలని నా మాజీ భార్య మా ఇంటికి వచ్చేసింది. ఈ టైమ్‌లో పిల్లలతో పాటు తను ఉండటం చాలా అవసరం. థ్యాంక్యూ సుజానే’’ అని పేర్కొన్నారు హృతిక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top