మాకు కరోనా సోకింది: హాలీవుడ్‌ స్టార్‌

Tom Hanks Says He And Wife Rita Test Positive For Covid 19 Over Twitter - Sakshi

కరోనా బారినపడ్డ హాలీవుడ్‌ జంట

హాలీవుడ్‌ జంట టామ్‌ హాంక్స్‌(63), రీటా విల్సన్‌(63)... కోవిడ్‌-19(కరోనా వైరస్‌) బారిన పడ్డారు. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వీరు వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని టామ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఓ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నామని పేర్కొన్నారు. ‘‘స్నేహితులందరికీ హలో.. రీటా, నేను ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాం. కాస్త అలసటగా అనిపించడంతో పాటుగా.. జలుబు, జ్వరం ఒళ్లు నొప్పుల కారణంగా పరీక్షలు చేయించుకున్నాం. కరోనా పాజిటివ్‌గా తేలింది. కాబట్టి ఇప్పటినుంచి వైద్య అధికారుల సూచనలు పాటిస్తూ ఇక్కడే ఉండాలి. మాకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. అబ్జర్వేషన్‌లో పెడతారు. ఆరోగ్యం కుదుటపడేంతవరకు ఇక్కడే ఉంటాం. మాకు సంబంధించిన విషయాలను పోస్ట్‌ చేస్తూ ఉంటాను. మీరంతా జాగ్రత్తగా ఉండండి’’అని టామ్‌ ట్వీట్‌ చేశారు.(కోవిడ్‌ ప్రపంచవ్యాప్త మహమ్మారి: డబ్ల్యూహెచ్‌ఓ)

ఈ క్రమంలో టామ్‌, రీటాలు త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. స్టార్‌ కపుల్‌ తమకు వినోదాన్ని పంచుతూనే ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా కాలిఫోర్నియాలో జన్మించిన టామ్‌ స్ప్లాష్‌, బ్యాచిలర్‌ పార్టీ, బిగ్‌, ఫారెస్ట్‌ గంప్‌, ది టెర్మిమినల్‌, అపోలో 13 తదితర చిత్రాల ద్వారా నటుడిగా గుర్తింపు పొందాడు. మొదటి భార్య సమంతా లూయీస్‌ నుంచి విడిపోయిన తర్వాత 1998లో నటి రీటాను పెళ్లి చేసుకున్నారు. కాగా తాను కరోనా పాజిటివ్‌ అని ప్రపంచాన్ని వెల్లడించిన తొలి హాలీవుడ్‌ స్టార్‌గా టామ్‌ నిలిచాడు. ఇక హ్యారీపోటర్‌ నటుడు డేనియల్‌ ర్యాడ్‌క్లిఫ్‌కు కరోనా సోకిందంటూ రూమర్లు ప్రచారమైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ర్యాడ్‌క్లిఫ్‌కు ఎటువంటి వైరస్‌ సోకలేదని ఆయన ప్రతినిధి మీడియాలకు వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దాదాపు 107కు పైగా దేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం ప్రకటించింది. ఇక దీని కారణంగా ఇప్పటివరకు 4250 మందికి పైగా మృత్యువాత పడగా.. ఇంచుమించు లక్షా 18 వేల మంది కరోనా అనుమానితులుగా ఉన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top