తూనీగ సాంగ్ టీజర్ విడుదల

వినీత్ చంద్ర, దేవయానీ శర్మ జంటగా నటిస్తున్న తూనీగ చిత్రం సాంగ్ టీజర్ ను డైరెక్టర్ ప్రేమ్ సుప్రీమ్ మాతృమూర్తి సిహెచ్. ప్రభావతి లాంచ్ చేశారు. అనంతరం ఈ పాటను ఆన్‌లైన్‌లో మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. హృదయం హృదయం కలిపిందీ క్షణం..అనే పల్లవితో సాగే ఈ పాటకు బాలాజీ సాహిత్యాన్ని అందించారు. హరిగౌర ఈ పాటను ఆలపించారు. సిద్ధార్థ్ సదాశివుని స్వరాలు సమకూర్చారు.
ఆద్యంతం హృద్యమైన సంగీతం, చక్కని భావాలతో సాగిపోయే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేస్తామని దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ తెలిపారు. అదేవిధంగా చిత్ర ప్రచార కార్యక్రమాల్లో సహకారం అందించి అండగా నిలిచిన ప్రముఖ దర్శకులు వేణు ఊడుగలకు, ప్రముఖ కళా దర్శకులు లక్ష్మణ్ ఏలేకు ధన్యవాదాలు తెలిపారు.
తూనీగకు ప్రముఖ నఖ చిత్రకారుని ప్రశంస
తూనీగ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రముఖ నఖ చిత్ర కారులు, రాజమహేంద్రి వాస్తవ్యులు రవి పరస ప్రత్యేకంగా ఓ కళాకృతిని రూపొందించారు.ఈ సందర్భంగా దర్శకుడు ప్రేమ్ సుప్రీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం కేంద్రంగా కొందరు ఔత్సాహికులు కలిసి రూపొందిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ బొనాంజాగా నిలవాలని ఆకాంక్షించారు. చిన్న చిత్రం అయినప్పటికీ పెద్ద విజయం అందుకుని, పెద్ద చిత్రాలకు పోటీగా నిలవాలన్నదే తన అభిమతం అని తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి