రణ్‌బీర్‌ అంటే చాలా ఇష్టం: విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda Said He Really Fond of Ranbir Kapoor - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో సూపర్‌హిట్‌ కొట్టిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్‌ హీరో అయిపోయాడు. తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో విజయ్‌ ఒకరు. టాలీవుడ్‌ సెన్సెషన్‌ల స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ హీరో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనేక విషయాలను పంచుకున్నారు.  ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నటుడిగా ఎవరిని స్పూర్తిగా తీసుకుంటారని ప్రశ్నించగా.. రణ్‌బీర్‌ కపూర్‌ అని సమాధానమిచ్చారు. తను ఎక్కువగా ఫాలో అయ్యే వారిలో రణ్‌బీర్‌ ముందు వరుసలో ఉంటాడని, అతన్ని ఎక్కువగా ఇష్టపడతానని చెబ్బుకొచ్చారు. (సాయంలోనూ ప్రత్యేకత చాటుకున్న విజయ్‌ దేవరకొండ)

ఇటీవల చూసిన కొన్ని షోలు, డాక్కుమెంటరీ సినిమాల గురించి విజయ్ అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ‘నేను తాజాగా ‘ఫౌధా’, ‘చీర్’‌ అనే డాక్యుమెంటరీలను చూశాను. ప్రతి ఒక్కరూ దీనిని చూడాలని కోరుతున్నాను. వీటితోపాటు మైఖేల్‌ జోర్డాన్‌, చికాగో బుల్స్‌కు సంబంధించిన ‘లాస్ట్‌ డాన్స్’‌ అనే డాక్యుమెంట్‌ సిరీస్‌ను చూశాను. ఈ సిరీస్‌ మీకు ఆశను, ప్రేరణను ఇస్తుంది. జీవితంలో ఆశయం కలిగిన వ్యక్తులను నేను ఇష్టపడతాను. వీళ్లు ఆ పని చేశారు.’ అని పేర్కొన్నారు. వీటిని చూడటం వల్ల నిరాశ నుంచి కోలుకోవడానికి, ప్రేరణ పొందడానికి ఉపయోగపడుతుందని ఆయన‌ అన్నారు. (కొత్త వినతులకు బ్రేక్‌ : విజయ్‌ ఫౌండేషన్‌)

ఒకవేళ నటుడు కాకపోతే ఆర్కిటెక్ట్‌ అయ్యేవాడినని విజయ్‌ అన్నారు. అర్కిటెక్స్‌ అంటే ఇష్టమని, ప్రయాణాలు చేసే సమయాల్లో అర్కిటెక్చర్‌పై ఆకర్షితుడైతానని తెలిపారు. ప్రపంచ అర్కిటెక్చర్‌పై వీడియోలను చూడటానికి ఎక్కువ సమయం కేటాయిస్తానని. ఆర్కిటెక్చర్ కోసం జపాన్‌ను సందర్శించాలనుకుంటున్నానని తన మనుసులో మాటను బయట పెట్టారు. ఇక విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్‌’ సినిమాలో నటిస్తున్నారు‌. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూర్తి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రౌడీకి జోడిగా అనన్యపాండే  నటిస్తున్నారు. (నువ్వు, నీ కుమారుడు ఇంట్లోనే ఉండిపోతారా? )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top