ఎయిమ్స్‌ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన అమిత్‌ షా

Amit Shah Sweeps Floor at AIIMS For PM Modi Birthday Week - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాతో పాటు పలువురు నాయకులు శనివారం ఉదయం చీపురు పట్టి ఎయిమ్స్‌ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. దీన్ని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు ‘సేవా వారం’ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు.
 

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలంతా నేటి నుంచి ‘సేవా వారం’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మన ప్రధాని దేశం కోసం, ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. అందుకు కృతజ్ఞతగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ వారమంతటిని మనం సేవా వారంగా నిర్వహించాలి’ అని పిలుపునిచ్చారు. అంతేకాక ఎయిమ్స్‌లోని రోగులకు భోజనం, పండ్లు అందించారు. సేవా వారం కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు వారం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. రక్త దాన శిబిరాలు, ఫ్రీ హెల్త్‌ చెక్‌ అప్‌ క్యాంప్స్‌, అనాథలకు, వృద్ధులకు పండ్లు పంచడం వంటి కార్యక్రమానలు చేపట్టాలని భావించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top