మొదటి పదేళ్లు బదిలీ కుదరదు!

Assam Government Bring Special Act For Teachers - Sakshi

ఉపాధ్యాయుల కోసం అసోం ప్రత్యేక చట్టం

గువాహటి: ఉపాధ్యాయులు మొదటి పదేళ్లు ఒకే చోట పనిచేసేలా, ఆ తర్వాతే వారికి బదిలీ అవకాశం కల్పిం చేలా అసోం ప్రభుత్వం ఓ సరికొత్త చట్టాన్ని తీసుకురా నుంది. ఈ మేరకు బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. దీని కోసం రూపొందించిన బిల్లును ప్రస్తుతం జరుగు తున్న బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు చెప్పా రు. ‘కొన్నేళ్లుగా ఉపాధ్యాయ బదిలీలు ప్రహసనంలా మారాయి. పలుకుబడి ఉన్న కొంతమంది తమకు తెలిసిన అధికారుల ద్వారా కావాల్సిన చోటుకు బదిలీ చేయించుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేలా ఓ కొత్త చట్టాన్ని ప్రవేశపె ట్టబోతున్నాం.

దీని ప్రకారం కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారు కనీసం పదేళ్ల పాటు బదిలీకి అనర్హులు. దీన్ని అతిక్రమించి అతను లేదా ఆమె బదిలీ పొందినట్లయితే వారితోపాటు, వారిని ట్రాన్స్‌ఫర్‌ చేసిన అధికారి సైతం విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కనీసం మూడేళ్ల శిక్ష తప్పదు. ఒకే చోట పదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీ చేసుకునేందుకు ఆన్‌లైన్‌ పద్ధతిని తీసుకొస్తున్నాం. అయితే, పరస్పర బదిలీలకు ఈ పదేళ్ల నిబంధన వర్తించదు’అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సరికొత్త చట్టానికి సభలోని అన్ని పక్షాలూ మద్దతివ్వడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top