మాజీ ఎమ్మెల్సీ ఇంటిని పేల్చేసిన మావోయిస్టులు

Bihar  State  MLC Residency Blow Up Attack By Maoists - Sakshi

సాక్షి, పాట్నా: బిహార్‌లోని గయా జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ ఇంటిని మావోయిస్టులు గురువారం తెల్లవారుజామున పేల్చేశారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. మాజీ ఎమ్మెల్సీ అయిన అర్జున్‌ సింగ్‌ నివాసం గయా జిల్లాలోని బోడిబిగా ప్రాంతంలో ఉంది. మావోయిస్టులు శక్తివంతమైన డైనమేట్‌ పేలుడు పదార్థాన్ని ఉపయోగించి  ఆయన ఇంటిని నేలమట్టం చేశారని పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనకు ముందు ఆ ఇంట్లో ఉంటున్న అర్జున్‌సింగ్‌ సమీప బంధువుపై మావోయిస్టుసలు భౌతికంగా దాడికి పాల్పడ్డారు. ఆ ఇంటిని ఖాళీ చేయవల్సిందిగా బెదిరించారు. ఆయన ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ఆ ఇంట్లో ఎవరూలేని సమయంలో మావోయిస్టులు పేల్చేశారని దుమారియ పోలీసు అధికారి ధర్మేంద్ర కుమార్‌ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ దాడి జరగడం పోలీసుల్లో కలవరం రేపుతోంది. గయా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రాజీవ్‌ మిశ్రా ఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. దాడికి కారణమైన మావోయిస్టులను గుర్తించడానికి ‘సేర్చ్‌ ఆపరేషన్‌ టీమ్‌’ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top