మూడు నెలలుగా చైనా దేశీయుడి పర్యటన

కర్ణాటక,మైసూరు : చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి మూడు నెలలుగా కారవ్యాన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం కలకలం రేపుతోంది. బ్యాట్రిక్ అనే వ్యక్తి సొంత కారవ్యాన్‌లో మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మైసూరులో పర్యటించిన బ్యాట్రిక్ నగరంలోని గిరిదర్శిని లేఅవుట్, లలితమహల్ మైదానంతో పాటు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాలు, హోటళ్లలో సంచరించాడు. దీంతో కరోనా వైరస్ మరింత విజృంభిస్తుందేమోనని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాట్రిక్ కరోనా ప్రబలక ముందే తాను భారత్‌కు వచ్చానని అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నగరంలోకి ప్రవేశించకుండా కారవ్యాన్‌లో ఉంటున్నానని తెలిపాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి