ఢిల్లీలో ఆ డాక్టర్‌ కుటుంబానికి కరోనా

Coronavirus : Mohalla Clinic Doctor family Test Positive - Sakshi

న్యూఢిల్లీ : దేశావ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న కూడా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఈశాన్య ఢిల్లీ మౌజ్‌పూర్‌లోని మొహల్లా క్లినిక్‌ విధులు నిర్వర్తిస్ను వైద్యునికి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. వైద్యునితో పాటు అతని భార్య, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిందని, వారిని ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు. అలాగే మార్చి 12 నుంచి 18 మధ్య కాలంలో డాక్టర్‌ను కలవడానికి ఆ క్లినిక్‌కు వెళ్లిన వారిని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రాదించాల్సిందిగా కోరారు. 

అయితే ఆ డాక్టర్‌ ఇటీవల ఏమైనా విదేశాలకు వెళ్లి వచ్చారా, లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ప్రాథమిక స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం మొహల్లా పేరిట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం రోజున ఢిల్లీలో కొత్తగా 5 కరోనా కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 37కు చేరింది.

తొలుత విదేశాల నుంచి వచ్చినవారే కరోనా బాధితుల జాబితాలో ఉండగా.. గత వారం రోజుల నుంచి కాంటాక్ట్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాల వారికి కరోనా సోకితే.. అది చాలా వినాశకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 600 దాటింది. 

చదవండి : చైనాలో కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ !

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top