ఆ దేశాల మీదుగా వెళ్లేటప్పుడు జాగ్రత్త!!

న్యూఢిల్లీ: ఇరాన్‌లోని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ దేశానికి చెందిన విమానం కూలిపోయిన నేపథ్యంలో..ఇరాన్, ఇరాక్, ఒమన్, పర్షియన్ గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లే ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. అన్ని ఎయిర్‌లైన్స్‌లు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ డీజీసీఏ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. అమెరికాకు చెందిన ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా పర్షియన్ గల్ఫ్ మీదుగా అమెరికన్ విమానాలను నిలిపివేయాలని ఆదేశించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి