హైదరాబాద్‌ హౌజ్‌లో మోదీ-ట్రంప్‌ ద్వైపాక్షిక చర్చలు

Donald trump India Visit: Trump Reach Hyderabad House - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత పర్యటలో ఉన్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హైదరాబాద్‌ హౌజ్‌కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ట్రంప్‌.. అక్కడ త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి ట్రంప్‌ దంపతులు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడి సమాధి వద్ద నివాళులర్పించారు. ఆ క్రమంలోనే ట్రంప్‌ దంపతులు రాజ్‌ఘాట్‌లో మొక్కను నాటారు.

ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్‌ కలిసి హైదరాబాద్‌ హౌజ్‌కు వెళ్లారు. హైదరాబాద్‌ హౌజ్‌లో భారత్‌, అమెరికాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగనున్నాయి. ఇరు దేశాల మధ్య 300 కోట్ల డాలర్ల విలువైన డిఫెన్స్‌ డీల్‌తో పాటు ఐదు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాముంది. మోదీ, ట్రంప్‌ చర్చల్లో పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top