తెలంగాణలో 9.4 రోజులు.. ఏపీలో 10.6 రోజులు

To double Number Of Corona Cases Time Has Come To Gradually Increase - Sakshi

కరోనా కేసులు రెట్టింపునకు పట్టిన సమయం

వివరాలు వెల్లడించిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయం క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ సగటు 7.5 రోజులు ఉండగా.. తెలంగాణలో 9.4 రోజులు, ఏపీలో 10.6 రోజులు ఉందని వివరించింది. జాతీయ సగటు కంటే ఎగువన 18 రాష్ట్రాలు ఉన్నాయని తెలిపింది. కరోనా నివారణ, నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటూ వాటిని అమలు చేసేందుకు ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నట్లు తెలిపింది.

దేశంలో లాక్‌ డౌన్‌కు ముందు కేసుల రెట్టింపునకు 3.4 రోజులు పట్టేదని, ఏప్రిల్‌ 19 నాటికి అది 7.5కి చేరిందని తెలిపింది. రెట్టింపు రేటు 20 రోజుల కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ– 8.5 రోజులు, కర్ణాటక– 9.2 రోజులు, తెలంగాణ– 9.4 రోజులు, ఆంధ్రప్రదేశ్‌– 10.6 రోజులు, జమ్మూ కశ్మీర్‌– 11.5 రోజులు, పంజాబ్‌– 13.1 రోజులు, ఛత్తీస్‌గఢ్‌ – 13.3 రోజులు, తమిళనాడు– 14 రోజులు, బిహార్‌– 16.4 రోజులుగా ఉంది. 

20 నుంచి 30 రోజుల మధ్యలో..
రెట్టింపు రేటు 20 రోజుల నుంచి 30 రోజుల మధ్య ఉన్న వాటిలో అండమాన్‌ నికోబార్‌– 20.1 రోజులు, హరియాణా– 21 రోజులు, హిమాచల్‌ ప్రదేశ్‌– 24.5 రోజులు, చండీగఢ్‌– 25.4 రోజులు, అస్సాం– 25.8 రోజులు, ఉత్తరాఖండ్‌– 26.6 రోజులు, లడఖ్‌– 26.6 రోజులుగా ఉంది. రెట్టింపు రేటు 30 రోజుల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒడిశా– 39.8 రోజులు, కేరళ– 72.2 రోజులుగా ఉంది. గోవాలో కరోనా రోగులందరూ కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. మహే (పుదుచ్చేరి), కొడగు (కర్ణాటక) – పౌడిగర్వాల్‌ (ఉత్తరాఖండ్‌)ల్లో గత 28 రోజులలో కేసులు నమోదు కాలేదు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top