8 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్

శ్రీనగర్ : మహమ్మారి వైరస్ వేగంగా విస్తరిస్తూ మానవాళికి సవాల్ విసురుతోంది. శ్రీనగర్‌లో తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కావడం గమనార్హం. పాజిటివ్‌గా వెల్లడైన కేసుల్లో ఒకరు 8 నెలల చిన్నారి కాగా, మరొకరు ఏడు సంవత్సరాల బిడ్డని తేలింది. ఈ చిన్నారులు సౌదీ అరేబియా నుంచి ఇటీవలే శ్రీనగర్‌కు తిరిగివచ్చి కోవిడ్-19 పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తి మనవళ్లని అధికారులు తెలిపారు. రెండు తాజా కేసులతో జమ్ము కశ్మీర్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గురువారం 649కు చేరగా మృతుల సంఖ్య 13కి పెరిగింది. మహమ్మారిని పారదోలేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తుండగా, సామాజిక దూరం పాటించి ప్రాణాంతక వైరస్‌ను ఓడించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి