లాక్‌డౌన్‌ పొడిగింపుపై మీరేమంటారు?

Home Minister Amit Shah speaks to chief ministers on lockdown extension - Sakshi

సీఎంలకు హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌

న్యూఢిల్లీ: ఈనెల 31వ తేదీతో ముగియనున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరికొద్ది రోజులపాటు పొడిగించాలన్న ప్రతిపాదనపై హోం మంత్రి అమిత్‌ షా గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగో దశ లాక్‌డౌన్‌ ఈ నెలాఖరుతో ముగియనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడిన అమిత్‌ షా..ఏఏ రంగాలకు మినహాయింపు అవసరం? ఎలాంటి సమస్యలున్నాయి? వంటి అంశాలపై చర్చించారు. సీఎంలు ఏం చెప్పారనే విషయం వెల్లడి కానప్పటికీ, ఏదో ఒక రూపంలో లాక్‌డౌన్‌ పొడిగింపునకే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు సమాచారం. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు, జన జీవనం సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం తుది నిర్ణయాన్ని రెండుమూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top