ప్రముఖ కమెడియన్‌పై నిషేధం

Indigo Banned Comedian Kunal Kamra For Misbehaving With Arnab Goswami - Sakshi

న్యూఢిల్లీ : ఆంగ్ల వార్తాచానెల్‌ ‘రిపబ్లిక్‌ టీవీ’ ఎడిటర్, ప్రముఖ జర్నలిస్ట్‌ ఆర్నాబ్‌ గోస్వామిపై తమ విమానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు స్టాండ్‌ అప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రాపై ఇండిగో విమానయాన సంస్థ నిషేధం విధించింది. 6 నెలల పాటు తమ విమానాల్లో ప్రయాణించేందుకు కామ్రాను అనుమతించబోమని ట్వీట్‌ చేసింది. ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో గోస్వామితో కామ్రా అభ్యంతరకరంగా, ఎగతాళి చేసినట్లుగా ప్రవర్తించాడని పేర్కొంది. ఇండిగో తరహాలో ఇతర విమానయాన సంస్థలు కామ్రాపై నిషేధం విధించాలని  కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి కోరారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top