కర్మకాలి టాయిలెట్ హోల్లో చేయి పెట్టాడంతే..

చెన్నై : కాలకృత్యాలు తీర్చుకుందామని టాయిలెట్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. టాయిలెట్ హోల్లో పడ్డ కారు తాళంచెవికోసం అందులో చేయిపెట్టడం ఇబ్బందులకు గురిచేసింది. ఈ సంఘటన తమిళనాడులోని మధురై పట్టణంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంజావూరుకు చెందిన మణిమారన్ అనే వ్యక్తికి సొంతంగా ఓ కారు ఉంది. అతడు ఆ కారును దూరప్రాంతాలకు బాడుగలకు నడుపుకుంటూ ఉంటాడు. ఈ ఉదయం కూడా తంజావూరునుంచి ప్రయాణికులను మధురైకి తీసుకుని వచ్చాడు. వారిని గమ్యస్థానం వద్ద దింపేసిన తర్వాత తంజావూరుకు తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకు దగ్గర కారు ఆపి, కాలకృత్యాలు తీర్చుకునేందుకు వాష్‌రూంలోకి నడిచాడు. కొద్దిసేపటి తర్వాత అతడి కారు తాళంచెవి టాయిలెట్ హోల్లో పడిపోయింది. దీంతో అతడు తాళంచెవిని తీసేందకు చేతిని హోల్లో పెట్టాడు.
ఈ ప్రయత్నంలో ముందుగా అతడికి వేరే వ్యక్తికి చెందిన ఓ సెల్‌ఫోన్ దొరికింది. ఆ తర్వాత అతడు మరింత లోపలికి చేతిని పోనిచ్చాడు. దీంతో చేయి అందులో ఇరుక్కుపోయింది. ఎంతమొత్తుకున్నా అతడి ఆర్తనాదాలు బయటివారికి వినిపించలేదు. దాదాపు గంటన్నరసేపు నరకం అనుభవించాడు. ఆ తర్వాత వాష్‌రూంలోకి వచ్చిన పెట్రోల్ బంకు సిబ్బంది ఒకరు అతడ్ని గమనించాడు. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశాడు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మణిమారన్ చేతిని సురక్షితంగా టాయిలెట్ హోల్లోంచి బయటకుతీశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి