ముంబై ఎయిర్‌పోర్టు రన్‌వే తిరిగి ప్రారంభం

ముంబై: రన్‌వేపై విమానం కూలిపోవడంతో గత కొద్ది రోజులుగా నిలిపివేసిన ఎయిర్‌పోర్టు రన్‌వేను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. రన్‌వే పూర్తి స్థాయిలో శుక్రవారం 4.47 గంటల నుంచి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. స్పైస్ జెట్ విమానం జూలై 2న రన్‌వేపై కూలీపోవడంతో విమాన రాకపోకలను ఈ రన్‌వే గుండా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాంతో 60 మందితో కూడిన బృందం 90 గంటల పాటు ఈ రన్‌వేను రిపేర్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.
అందులో భాగంగా దాదాపు 41 టన్నులు ఉన్న ఈ విమానాన్ని రన్‌వే నుంచి పక్కకు లాగారు. ఆ విమానంలో ఉన్న ఇందనం, సరుకులను ఖాళీ చేసి రన్‌వే నుంచి తొలగించారు. ఒక వైపు వర్షం పడుతుంటే.. ఆ విమానం గేర్ లభించకపోవడంతో తీవ్రం శ్రమించి దాన్ని పోక్లైన్ సాయంతో రన్‌వే నుంచి పక్కకు లాగారు. ఈ క్రమంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రమం లిమిటెడ్ రన్‌వేను తిరిగి ప్రారంభించనున్నట్టు పేర్కొంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి