జమ్మూకశ్మీర్‌లో ఎన్ఐఏ దాడులు

సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రనిధుల కేసులో భాగంగా జమ్మూకశ్మీర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలో ఏకకాలంలో నాలుగు చోట్లు ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అక్కడి ఇళ్లను జల్లెడపడుతున్నారు. వేర్పాటువాద నేత మసరత్ ఆలంను గతవారం జమ్మూకశ్మీర్ జైలు నుంచి ఢిల్లీ నుంచి తరలించిన ఎన్ఐఏ.. విచారణలో అతడని నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఆ డేటా ఆధారంగానే ఇప్పుడు సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. టెర్రర్ ఫండింగ్ కేసు 2012లో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మసరత్ ఆలంతోపాటు వేర్పాటువాద నేతలు అసియా ఆంద్రబి, షబీర్ షా సహా 12మందిపై అభియోగాలు నమోదుచేసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి