ఇప్పట్లో కుదరదు: సీఎం

Not Possible to Bring Stranded Students From Kota: Bihar CM - Sakshi

పట్నా: రాజస్థాన్‌లోని కోట నగరంలో చిక్కుకున్న విద్యార్థులను వెనక్కి తీసుకురావడం కుదరదని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించే వరకు విద్యార్థులను తీసుకురాలేమని చెప్పారు. ప్రధాని నరేంద్ర  మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. (అయ్యో.. ఆమె చనిపోలేదు!)

‘కోట నగరం లోని కోచింగ్‌ సెంటర్లలో పెద్ద సంఖ్యలో బిహార్‌ విద్యార్థులు చిక్కుకుపోయారు. కొన్ని రాష్ట్రాలు తమ విద్యార్థులను తీసుకుతెచ్చుకున్నాయి. కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను మొదటి నుంచి బిహార్‌ పాటిస్తోంది. లాన్‌డౌన్‌ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించే వరకు విద్యార్థులను తీసుకురావడం సాధ్యం కాద’ని నితీశ్‌ కుమార్‌ తెలిపారు. అయితే కోటలో బిహార్‌ విద్యార్థులతో ఇతర ప్రాంతాలకు చెందిన వారూ చిక్కుకుపోయారని వెల్లడించారు. (కరోనా: పతంగులు ఎగరేయొద్దు)

ఇతర రాష్ట్రాల్లో చిక్కుపోయిన బిహారీలను ఆదుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇలా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన 15 లక్షల మంది ఖాతాల్లో వెయ్యి రూపాయల చొప్పున జమ చేసినట్టు తెలిపారు. కేంద్ర వైద్యారోగ్య వెల్లడించిన తాజా గణంకాల ప్రకారం బిహార్‌లో ఇప్పటివరకు 277 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. కోవిడ్‌-19 బారిన పడిన వారిలో 56 మంది కోలుకున్నారు. 

లాక్‌డౌన్‌లోనూ చేతివాటం చూపించాడు! 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top