విద్యుత్‌ సమస్యలకు పరిష్కారం చూపండి: మోదీ

PM Nrendra Modi reviews power sector - Sakshi

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలకు తగు పరిష్కారం చూపి, పనితీరు మెరుగు పరుచుకునేందుకు సాయపడాలని ప్రధాని మోదీ కోరారు. రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా విద్యుత్‌ పంపిణీ విధానం వేర్వేరుగా ఉండటం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్‌ రంగ సమస్యల పరిష్కారానికి తీసుకువచ్చిన టారిఫ్‌ విధానం, విద్యుత్‌(సవరణ)బిల్లు–2020లోని అంశాలపై సమీక్ష జరిపారు. విద్యుత్‌ వినియోగదారుకు సంతృప్తి కలిగించాల్సిన అవసరం ఉందన్న ప్రధాని..నిర్వహణ సామర్థ్యం పెంపు, ఆర్థిక సమృద్ధి సాధించాలన్నారు.

డిస్కమ్‌ లు తమ పనితీరును ఎప్పటికప్పుడు వెల్లడించడం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, చెల్లిస్తున్న రుసుములను బేరీజు వేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. నవీన, పునరుత్పాద ఇం ధన వనరుల వినియోగం వ్యవసాయ రంగంలో పెరగాలన్నారు. పూర్తిగా రూఫ్‌టాప్‌ సౌరశక్తి విని యోగించుకునేలా ప్రతి రాష్ట్రం కనీసం ఒక నగరా న్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. విద్యుత్‌ పరికరాలను దేశీయంగా తయారు చేసుకోవడంతో ఉద్యోగిత పెంపు వంటి ఉపయోగాలున్నాయన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top