పాఠ్యాంశంగా ట్రిపుల్‌ తలాక్‌

Triple Talaq Syllabus In LAW In Uttar Pradesh - Sakshi

లా ​కోర్సులో పాఠ్యాంశంగా ట్రిపుల్‌ తలాక్‌

లక్నో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లోని బరైలీలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే రోహిల్ ఖండ్ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టారు. వర్శిటీ లా డిపార్ట్‌మెంట్ అధిపతి అమిత్ సింగ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్‌ఎం కోర్సుల్లో ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ చట్టానికి (2019) సంబంధించిన సిలబస్‌ను చేర్చినట్టు చెప్పారు. పాత సిలబస్‌ స్థానంలో దీనిని ప్రవేశపెట్టినట్లు వివరించారు.  యూనివర్శిటీ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.
 
చట్టంలోని నిబంధనలను తెలుసుకోవడంతో పాటు కేస్ స్టడీస్‌కు కూడా ఈ అంశం ఉపకరిస్తుందని, దీని ద్వారా విద్యార్థులు మంచి లాయర్లుగా మారి, ప్రజలకు మరింత న్యాయం చేకూర్చగలరని ఆశిస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థుల్లో ఒకరు ట్రిపుల్ తలాక్‌పై డాక్టరేట్ చేస్తున్నట్టు చెప్పారు. కాగా, కొత్త సిలబస్‌ పట్ల తామెంతో ఆసక్తిగా ఉన్నట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top