రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లోని అశోకా హాల్లో ఏర్పాటు చేసిన విందు సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన విందు భేటీలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఈ విందు సమావేశానికి అతిథులుగా ఆహ్వానించగా ఆ జాబితాలో కేసీఆర్ కూడా ఉన్నారు.
డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ అతిథులను పరిచయం చేసుకుంటూ వారితో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో కరచాలనం చేసి తనను పరిచయం చేసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ వెంట రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉష, ప్రధాని నరేంద్ర మోదీ అతిథులను పలకరిస్తూ ముందుకు సాగారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి