టీడీపీ అభ్యర్థికి వింత పరిస్థితి!

Bitter Experience For Chintalapudi TDP Candidate - Sakshi

సాక్షి, చింతలపూడి (పశ్చిమగోదావరి జిల్లా) : రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీకి వ్యతిరేక గాలి వీస్తోందనడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఓ పక్క ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల బహిరంగ సభలతో పాటు పార్టీ అభర్థుల రోడ్‌షోలకు జనం‌ పోటేత్తుతుండగా... మరోవైపు టీడీపీ రోడ్ షోలు మాత్రం జనం లేక‌ వెలవెలబోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావుకు ఆదివారం వింత అనుభవం ఎదురైంది. జంగారెడ్డిగూడెం మండలం ఏ. పోలవరంలో కర్రా రాజారావు రోడ్ షో నిర్వహించగా ఒక్కరంటే ఒక్కరు కూడా రోడ్డుపై కనిపించలేదు.

మరోవైపు ఆయన వెంట కూడా ప్రచారంలో ఇద్దరు ముగ్గురు అనుచరులే ఉండటం టీడీపీ దుస్ధితిని తెలియజేస్తోంది. రోడ్ పై ఒక్కరు లేకపోయినా కూడా కర్రా రాజారావు మాత్రం ఖాళీ రోడ్డు‌, గోడలకు దండం పెడుతూ.. తనకు, ఎంపీగా మాగంటి బాబుకి‌ ఓటు వేయాలని చెప్పుకు పోవడం.. ఆయన వెంట జీపులో ఉన్న ఇద్దరు అనుచరులకి‌ కూడా ఆశ్చర్యం‌ కలిగించింది. కనీసం తెలుగుదేశం కార్యకర్తలు కూడా లేకుండా చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ షో జరుగుతున్న తీరు వారి‌ ఓటమికి సంకేతాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొంటున్నారని, వైస్ జగన్ సీఎం కావడం కాయమని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top