మండలి ‘స్థానిక’ అభ్యర్థిగా కవిత నామినేషన్‌

Kalvakuntla Kavitha Filed Namination For MLC Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : శాసనమండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఆమె నామినేషన్‌ వేశారు. ఆమెతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, గంప గోవర్ధన్, సురేందర్‌ తదితరులు ఉన్నారు. కాగా, టీఆర్‌ఎస్‌ నుంచి పలువురు ఆశావాహులు టికెట్‌ ఆశించినప్పటికి పార్టీ అధినేత కేసీఆర్‌ మాత్రం కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించని ఆమె ఈ నెల 13న జరిగిన పార్టీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.
(చదవండి: కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌లో ప్రమాదం!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top