అందుకే సింధియా పార్టీ వీడారు : నగ్మా

Many Will Follow Scindia Says Congress Leader Nagma - Sakshi

న్యూఢిల్లీ : జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా కాంగ్రెస్‌ పార్టీలోని అసమ్మతి నేతలకు మార్గం సుగమం చేసిందని నటి, ఆ పార్టీ నేత నగ్మా వ్యాఖ్యానించారు. సింధియా పార్టీని వీడటంపై కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. బుధవారం ట్విటర్‌ వేదికగా ఆమె స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీలోని చాలా మంది నాయకులు అసంతృప్తితో వేగుతున్నారని, దాన్ని కనిపెట్టడంలో పార్టీ విఫలమైందని అన్నారు. సరైన గుర్తింపు లభించకపోవటం మూలానే సింధియా పార్టీ వీడారని చెప్పారు. మరికొంతమంది అసమ్మతి నాయకులు పార్టీ వీడేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ( ‘మహరాజ్‌’ కోసం ఏం చేయడానికైనా సిద్ధం..)

కాగా, మూడు రోజుల రాజకీయ రసవత్తరతకు తెరదించుతూ సింధియా బుధవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నడ్డా సమక్షంలో ​కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే బీజేపీ సింధియాను మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. ( రాజ్‌నాథ్‌తో సింధియా భేటీ )
 

చదవండి : సింధియా నిష్క్రమణతో ‘చేతి’కి చిక్కులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top