హుద్‌హుద్ సంక్షోభంలోనూ దోచుకుతిన్నారు

Minister Botsa Satyanarayana Fires On Chandrababu - Sakshi

బాబు దోచుకున్నదంతా బయటకు తీసి పాపాలు కడుక్కోవాలి : బొత్స

సాక్షి, విజయనగరం : ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తన పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా తీర్మానాలు చేస్తూ.. సిగ్గు లేకుండా రాజకీయ దురాలోచనలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు కంపెనీల్లో పనిచేస్తున్న వారికి కరోనా పాజిటివ్ వస్తే పట్టించుకున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో బొత్స మాట్లాడుతూ.. హుద్‌హుద్‌ సమయంలో విశాఖ జిల్లాలో రెండు, మూడ్రోజులు తాగేందుకు నీళ్లులేవని, ఆ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని టీడీపీ దోచుకుతిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతి అని.. రైతులను ఆదుకుంటున్నారని అన్నారు. ( ఆ 3 జిల్లాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు..)

పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చి కొంటున్నామని చెప్పారు. కరోనాతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. జగనన్న విద్యా దీవెన, సున్నా వడ్డీ పథకం అందించామని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు హయాంలో సున్నా వడ్డీ అమలు చేయకుండా మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. బాబు దోచుకున్నదంతా బయటకు తీసి పాపాలు కడుక్కోవాలన్నారు. 25 లక్షల కార్డులు తీసేశామని కూడా విమర్శలు చేస్తున్నారని, ఆ ఆరోపణలను నిరూపించాలన్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తున్నారని, అయినప్పటికి క్వారంటైన్ సెంటర్లలో సమస్యలు ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో కూర్చొని విమర్శలు చేయడం సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top