ఎమ్మెల్సీ పదవికి పయ్యావుల రాజీనామా

సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేశవ్ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్సీ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన పయ్యావుల.. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి