ఈటలపై కేసీఆర్‌ కత్తి నూరుతున్నారు

Revanth Reddy Comments On KCR And Etela Rajender - Sakshi

వచ్చే వారం ఈటల మంత్రి పదవి పోతుంది 

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కత్తినూరుతున్నారని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, పార్లమెంట్‌ సభ్యులు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం, జెండాలో భాగం తమకు కూడా ఉన్నాయంటూ గతంలో ఈటల చేసిన వ్యాఖ్యలను కేసీఆర్‌ మనసులో పెట్టుకున్నారని చెప్పారు. అందుకే గత కొద్దిరోజులుగా జరుగుతున్న అల్లర్లపై కేసీఆర్‌ మౌనం వహిస్తున్నారన్నారు.

కేవలం వారం రోజుల్లో మంత్రి పదవి ఎగిరిపోబోతుందన్నారు. హైదరాబాద్‌లో శనివారం జర్నలిస్టు సంఘాలు నిర్వహించిన ‘ఉపవాస దీక్ష’కు రేవంత్‌రెడ్డి హాజరై జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ‘కరోనా’వైఫల్యాలన్నింటినీ ఎత్తి చూపి ఈట లను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు స్వయానా కేసీఆర్‌ కుట్ర పన్నుతున్న విషయం టీఆర్‌ఎస్‌ పార్టీలోని ఓ ముఖ్యనేత తనకు ఫోన్‌లో చెప్పాడన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top