హత్యకు కుట్ర: అఖిలప్రియపై సంచలన ఆరోపణలు

TDP Leader AV Subba Reddy Death Allegations On Akhila Priya - Sakshi

సాక్షి,  కర్నూలు : మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడుపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరు తనను చప్పేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. వారి అనుచరులు రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సంజోరెడ్డితో చేతులు కలిపి తనను హతమార్చాలని చూస్తున్నారని అన్నారు. అంతే కాకుండా తనను చంప్పేందుకు రూ.50 లక్షలు సుపారీ కూడా మాట్లాడుకున్నారని ఊహించని రీతిలో బాంబు పేల్చారు. దీనిపై కడప పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి కుట్రను భగ్నం చేసి తనను కాపాడారని తెలిపారు. అనంతరం పోలీసులు విచారణలో నిందితులు పలు నిజాలను వెల్లడించారు. భూమా అఖిలప్రియ అనుచరుడు శ్రీను తమకు డబ్బులు ఇచ్చాడని నిందితులు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను చంపాలని చూస్తున్నారని, భూమా అఖిలప్రియ, భార్గవ రాముడిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులను వేడుకున్నారు. తాజా ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ భర్తపై ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయిన విషయం తెలిసిందే. (అఖిలప్రియ భర్తపై మరో కేసు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top