ఇద్దరి మధ్యే యుద్ధం

TRS And Congress Contest in MLC By election - Sakshi

తుదిబరిలో టీఆర్‌ఎస్‌ నుంచి మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి ప్రతాప్‌రెడ్డి

హోరాహోరీగా సాగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

క్యాంపు రాజకీయాలపై దృష్టిసారించిన ఇరుపార్టీలు

నేడు బెంగళూరువెళ్లనున్న కాంగ్రెస్‌ సానుకూల ఓటర్లు

మూడు చోట్ల శిబిరాలకు టీఆర్‌ఎస్‌ యోచన

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోరు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే నడవనుంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులే తుది బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తలపడుతున్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ప్రతాప్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన కొమ్మరెడ్డి ఉదయ్‌మోహన్‌రెడ్డి బరి నుంచి తప్పుకొన్నారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, శ్రమజీవి పార్టీ అభ్యర్థి జాజుల భాస్కర్‌ తమ నామినేషన్లను ఉపసంహరించకున్నారు. దీంతో మహేందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఇద్దరే పోటీలో నిలిచారు.

కాంగ్రెస్‌ తమసానుకూల ఓటర్లనుశనివారమే జిల్లాదాటించేందుకుప్రయత్నాలు చేస్తోంది.వీరిని బెంగళూరుకు తరలించేందుకుఅవసరమైన ఏర్పాట్లుపూర్తిచేసినట్లుసమాచారం.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే ఇరు పార్టీలు క్యాంపు రాజకీయాలపై దృష్టిసారించాయి. వీలైనంత ఎక్కువ మంది ప్రాదేశిక సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తమవైపు తిప్పుకొనేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను సమీకరించి శిబిరాలు నిర్వహించే ఏర్పాట్లలో ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ కంటేముందే కాంగ్రెస్‌ పార్టీ మేల్కొనడం విశేషం. తమ సానుకూల ఓటర్లను శనివారమే జిల్లా దాటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీరిని బెంగళూరుకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సమాచారం. అందరినీ ఒకేసారి తీసుకెళ్లడం కష్టమని భావించిన ఆ పార్టీ.. విడతల వారీగా ఓటర్లను శిబిరానికి చేర్చనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నిక జరిగే 31వ తేదీ ముందు రోజు వరకు అక్కడే బస చేసే వీలుంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో  ఉండటంతో ఆ రాష్ట్రం సురక్షితమని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శిబిరం నిర్వహణకు బెంగళూరు నగరాన్ని ఎంచుకున్నట్లు కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత వెల్లడించారు. 

జూన్‌ 4నుంచి ‘బడిబాట’
ధారూరు: అన్ని గ్రామాల్లో 2019– 20 సంవత్సరానికి సంబంధించిన ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని  జూన్‌ 4నుంచి 12వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం డీఈఓలు, ఎక్స్‌అఫీషియో ప్రాజెక్టు ఆఫీసర్లకు ఆదేశాలు అందాయి. దీంతో పాటు బడిబాట కార్యాచరణ, మార్గదర్శకాలను రాష్ట్ర స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ టి.విజయకుమార్‌ ఇందులో పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమ నిర్వాహణ కోసం విద్యాశాఖ నుం చి ప్రతి పాఠశాలకు రూ.వెయ్యి రూపాయల చొప్పున విడుదల చేసి డీఈఓలకు బాధ్యత అప్పగించారు.

టీఆర్‌ఎస్‌ పరిశీలనలో మూడు ప్రాంతాలు
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌కు భిన్నంగా వ్యవహరిస్తోంది. అందరినీ ఒకే చోటుకు చేర్చితే నిర్వహణ కష్టమని భావించిన ఆ పార్టీ.. మూడు చోట్ల క్యాంపు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, విశాఖపట్నంతోపాటు నగర శివార్లలోని ఓ ప్రాంతాన్ని ప్రాథమిక ఎంచుకున్నట్లు సమాచారం. ఎంటీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్‌.. ఇలా కేటగిరీలుగా విభజించి ఆయా నిర్దేశిత శిబిరాలకు తరలించే అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థాయిని బట్టి మర్యాదలు చేయ డంతోపాటు ప్యాకేజీలు కేటాయించడం సులభమవుతుందని ఆ పార్టీకి చెందిన ఓ నేత తెలి పారు. అయితే ఓటర్లను సమీకరణ మరో రెండు రోజుల తర్వాతే ఉంటుందని తెలిసింది. ఆలోగా శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ఎవరిని ఎక్కడికి తరలించాలన్న అంశంపై కార్యాచరణ సిద్ధం చేస్తారని సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top