ప్రధాని, రాష్ట్రపతిని అందించిన నంద్యాల

Two Aggressive Leaders Became President And Prime Minister Nandyal Parliament Constituency - Sakshi

సాక్షి, కర్నూలు :  కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గానికో ప్రత్యేకత ఉంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని అందించిన ఘనత ఈ సెగ్మెంట్‌ దక్కించుకుంది. రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి,  ప్రధాని పీవీ నరసింహరావు నంద్యాల నుంచి విజయం సాధించారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికంటే ముందు.. 1977లో జరిగిన ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 41 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా జనతా పార్టీ తరఫున ‘నీలం’ ఒక్కరే గెలిచి రికార్డు సృష్టించారు. ఇక 1991లో ప్రధానిగా పీవీ నరసింహరావు ఎన్నికవడంతో నంద్యాల ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి పీవీ కోసం రాజీనామా చేశారు. ఇక్కడినుంచి పీవీ రెండుసార్లు విజయం సాధించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top