ఫీట్‌లా మారిన బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌

Bottle Cap Challenge Videos Hilarious Fails - Sakshi

టెన్‌ ఇయర్స్‌ చాలెంజ్‌.. మరువక ముందే మరో చాలెంజ్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ చాలెంజ్‌ అందరికి ఓ ఫీట్‌లా మారింది. అదే ‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌’. ఈ చాలెంజ్‌ను పలువరు సెలబ్రిటీలు ప్రయత్నించి విజయవంతంగా పూర్తిచేశారు. కాగా చాలా మంది నెటిజన్లు మాత్రం ఈ చాలెంజ్‌ను పూర్తి చేసేందుకు ప్రయల్నిస్తూ.. బాటిల్‌ క్యాప్‌ కిందపడకుండ .. వాళ్లు కిందిపడి భంగ పడుతున్నారు. ఈ వీడియోలు కూడా సోషల్‌ మీడియాల వైరల్‌గా మరుతున్నాయి.

ఈ చాలెంజ్‌ ఏమిటంటే.. ఒక బాటిల్‌పై దాని క్యాప్‌ వదులుగా బిగించి ఓ చోట కదలకుండా నిల్చోబెట్టాలి. తర్వాత దానికి కొంచం దూరం నుంచి కాలుతో కిక్(తన్నడం) చేస్తే ఆ క్యాప్‌ గిరగిరా తిరిగి కింద పడాలి. బాటిల్‌ కింద పడటం గాని, కాలు కదిలే దిశ మారటం గాని జరగకూడదు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్, హాలీవుడ్ నట దిగ్గజం జాసన్ స్టాథమ్,అమెరికా గాయకుడు జాన్ మేయర్‌లు ఈ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తిచేయడంలో సఫలం అయ్యారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top