కరోనా లాక్‌డౌన్‌: చైనీస్‌ ఫుడ్‌ కావాలంటూ ఏడుపు!

Corona LockDown: 4 years Girl Meltdown When She Hears Chinese Food Shutdown - Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారిని అరికట్టడానికి అనేక దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసర వస్తువులు మినహా మార్కెట్లో మరొకటి లభించే అవకాశమే లేకుండా పోయింది. అయితే ఇప్పటివరకు రెక్కలు తొడిగిన పక్షుల్లా  విహరించిన వారు కరోనా దెబ్బకు ఒక్కసారిగా ఇంటికి అతుక్కుపోయారు. ఇప్పటికే సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, హోటళ్లు, విద్యాసంస్థలు మూతపడటంతో ప్రజలు ఇంటి వాతావరణానికి, ఫుడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో లండన్‌కు చెందిన జొయాన్‌ తన నాలుగేళ్ల కూతురు లయల చైనీస్‌ ఫుడ్‌ కావాలంటూ ఏడుస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. 

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
లాక్‌డౌన్‌ కారణంగా నాన్‌డోస్‌, కెఎఫ్‌సి, మెక్‌డోనాల్డ్‌ వంటి రెస్టారెంట్లు మూసేశారని, అమ్మనే ఇంట్లో వంట చేస్తుందని ఆ పాపకు తల్లి చెబుతుంది. దీంతో బోరును విలపించిన లయల.. కనీసం చైనీస్‌ ఫుడ్‌ కూడా దొరకదా అని కన్నీటి ధారతోనే తల్లిని అడిగింది. దీంతో చైనీస్‌ ఫుడ్‌ కూడా దొరకదని బదులిచ్చింది. మరి ఫుడ్‌ డెలీవరి కూడా లేదా అని అమాయకంగా తన తల్లిన ప్రశ్నించింది. దీంతో ఫుడ్‌ డెలీవరి కూడా లేదని అమ్మనే వంట చేస్తుందని మరోసారి లయలకు తెలిపింది. ఇక ఇంకా బిగ్గరగా ఏడుస్తున్న లయలను ఓదార్చడం తల్లికి కూడా సాధ్యపడలేదు. 

ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. చిన్నప్పట్నుంచే పిల్లలకు బయటి ఫుడ్‌ అలవాటు చేయడం తల్లిదండ్రుల పెద్ద తప్పిదమని కొందరు పేర్కొంటున్నారు. ఆరోగ్యపరంగా బయట ఫుడ్‌ ఎంతో కీడు చేస్తుందని సూచిస్తున్నారు. తల్లి వంట అంత చెత్తగా ఉంటుంది కాబోలు అంటూ మరికొంతమంది నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్‌ చేస్తున్నారు. ‘చైనీయులు అడ్డమైన ఆహారమే తినే కరోనా వైరస్‌ను ప్రపంచంపై వదిలారని.. చైనా, కరోనా దెబ్బకి ప్రపంచం విలవిల్లాడుతుంటే చైనీస్‌ ఫుడ్‌ కావాలా.. రెండు మొట్టికాయలు వేస్తే సరి’ అంటూ మరికొంతమంది ఘాటుగా మందలిస్తున్నారు.  

చదవండి:
జర్నలిస్టుకు కరోనా పాజిటివ్‌
ఇంకా కోలుకోని కనికా కపూర్‌

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top