మళ్లీ చిరుత పంజా, వీడియో వైరల్‌

leopard Was Attacking Man In Nashik - Sakshi

ముంబై‌: లాక్‌డౌన్‌తో జనావాసాలు నిర్మానుష్యంగా మారడంతో జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చిరుతలు తరచుగా జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని నాశిక్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందిరా నగర్‌లో రోడ్డు‌ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై ఓ చిరుత అనూహ్యంగా దాడికి దిగింది. ఈ దాడిలో ఇరువురిని తీవ్రంగా గాయపరిచింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇక ఇటీవల హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో, నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. వీటిని పట్టుకునేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగుతున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top