టిక్‌టాక్‌లో దుమ్మురేపుతున్న తోబుట్టువులు

Siblings From Jharkhand Are Going Viral For Their Dance Videos - Sakshi

రాంచీ: జార్ఖండ్‌కు చెందిన ఈ తోబుట్టువులిద్దరు డాన్స్‌ వీడియోలతో టిక్‌టాక్‌లో ఇప్పటికే మిలియన్ మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరు ట్విట్టర్లో కూడా ట్రెండ్‌ అవుతున్నారు. సనాతన్ కుమార్ మహాతో, అతని సోదరి టిక్‌టాక్‌ వీడియోలతో ఎందరినో అలరిస్తున్నారు. ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్‌ లేకుండా.. ఇంటి బయట నిల్చుని చేసే వీరి డాన్స్‌కు నెటిజనులు ఫిదా అవుతున్నారు. తమ ప్రతిభ, స్వయం కృషితో వీరు జనాల హృదయాలను గెలుచుకోగలిగారు. వీరి వీడియోలు ఇప్పుడు ట్విట్టర్‌లోను ట్రెండ్‌ అవుతున్నాయి. వీరి ప్రతిభను ప్రశంసించే వారిలో టీవీ హోస్ట్‌ మినీ మాథుర్ కూడా ఉన్నారు. ‘ఈ రోజు ఉదయం నేను చూడవలసినది ఇదే !! 2020లో సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికీ చాలా ప్రేమ’ అని ట్వీట్‌ చేశారు.
 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top