వైరల్‌ వీడియో: మరో టాలెంట్‌ను పరిచయం చేసిన ఫేస్‌బుక్‌

Viral Video Man Sings Baahubali Song Kaun Hai Woh - Sakshi

సోషల్‌ మీడియా వల్ల లోకల్‌ టాలెంట్‌ వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే బేబీ, రాణు మరియా ముండల్ అనే యాచకురాలి ప్రతిభను వెలుగులోకి తెచ్చిన సోషల్‌మీడియా ప్రస్తుతం మరో నూతన గాత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ గానం మనసుల్ని రంజింపచేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. హేము గమేతి భిల్‌ అనే ఫేస్‌బుక్‌ అకౌంట్లో షేర్‌ చేసిన ఈ వీడియోలో ఓ యువకుడు భారతీయ సినీ రికార్డులను తిరగరాసిన ‘బాహుబలి: ది బిగినింగ్’‌ చిత్రంలోని ఎవ్వడంట.. ఎవ్వడంట హిందీ వెర్షన్(కౌన్‌ హై ఓ)‌ను పాటను అద్భుతంగా పాడాడు. అయితే ఈ పాట పాడిన వ్యక్తి వివరాలేం తెలియవు. బాహుబలి చిత్రంలో ఎంఎం కీరవాణి స్వరపర్చిన ఈ పాటను సదరు వ్యక్తి అంతే హృద్యంగా పాడి నెటిజనుల మనసు గెలుచుకున్నాడు. ఈ వీడియో చూసిన వారంతా మాటలు లేవు అంటూ ప్రశంసిస్తున్నారు. 
 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top