దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీసు

BCCI issues show-cause notice to Dinesh Karthik - Sakshi

న్యూఢిల్లీ: భారత సీనియర్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. బోర్డు కాంట్రాక్టు ప్లేయర్‌ అయిన కార్తీక్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తరఫున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో జెర్సీ వేసుకొని కనిపించాడు. ఈ జట్టు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ది కావడంతో అతని యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ అయిన కార్తీక్‌ సీపీఎల్‌లో పాల్గొనడం వివాదం రేపింది. ఈ ఫొటోలు బీసీసీఐ కంటబడటంతో సీఈఓ రాహుల్‌ జోహ్రి అతని కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ కోరారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top