లబ్‌షేన్‌కు సీఏ కాంట్రాక్టు 

CA Contracts For Labuschagne By Australia Cricket Board - Sakshi

మెల్‌బోర్న్‌: ఆసీస్‌ జట్టులో ఇటీవల నిలకడగా రాణిస్తున్న లబ్‌షేన్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) సెంట్రల్‌ కాంట్రాక్టు కట్టబెట్టింది. అయితే స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ గైర్హాజరీలో కంగారూ జట్టును ఆదుకున్న ఉస్మాన్‌ ఖాజాకు సీఏ షాకిచ్చింది. 2020–21 సీజన్‌కుగానూ గురువారం ప్రకటించిన కాంట్రాక్టు జాబితా నుంచి అతన్ని తప్పించింది. గతేడాది యాషెస్‌ సిరీస్‌ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఖాజాతో పాటు మార్కస్‌ హారిస్, నాథన్‌ కూల్టర్‌నీల్, పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్, షాన్‌ మార్‌‡్ష, మార్కస్‌ స్టొయినిస్‌ తమ కాంట్రాక్టులు కోల్పోయారు. వీరి స్థానంలో బర్న్స్, లబ్‌షేన్, మాథ్యూ వేడ్, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్‌‡్ష, పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్, స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ సెంట్రల్‌ కాంట్రాక్టులు పొందారు. సీఏ ప్రకటించిన జాబితాలో మొత్తం 20 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో చివరి టి20 ఆడిన మ్యాక్స్‌వెల్‌ను జాబితాలో కొనసాగించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top