ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ తేదీల్లో మార్పు

Changes In World Badminton Championships Dates - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టులో స్పెయిన్‌ వేదికగా జరగాల్సిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను నాలుగు నెలలపాటు వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్‌ ప్రకారం ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాది నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 5 వరకు జరుగుతుందని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తెలిపింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే సంవత్సరం జూలై–ఆగస్టుకు వాయిదా పడటంతో బీడబ్ల్యూఎఫ్‌ తమ మెగా టోర్నీ షెడ్యూల్‌లో మార్పులు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top