మూడేళ్లు కాదు.. 30 ఏళ్లు: యువీ

Feels Like 30, Yuvraj's Message To Wife Hazel Keech - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌-హజల్‌ కీచ్‌లు వివాహం జరిగే మూడేళ్లు అయ్యింది. 2016, నవంబర్‌ 30వ తేదీన వీరిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం(నవంబర్‌ 30) భార్య హజల్‌ కీచ్‌కు యువరాజ్‌ విన్నూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. ‘ శుభాకాంక్షలు భార్యామణి గారూ.. మనకు పెళ్లి జరిగి మూడేళ్లే అయ్యింది.. కానీ నాకు మాత్రం ముప్పై ఏళ్లు అయినట్లుంది. హ్యాపీ యానివర్సరీ మై లవ్‌’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. దీనికి హజల్‌కీచ్‌తో కలిసి ఉన్న అందమైన ఫోటోను యువరాజ్‌ షేర్‌ చేశాడు. యువరాజ్‌ పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలిపిన వారిలో కేవలం ఫ్యాన్సే కాకుండా పలువురు క్రికెటర్లు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా యువరాజ్‌కు అభినందనలు తెలియజేశారు. ‘ కంగ్రాట్స్‌ పాజీ అండ్‌ హజల్‌కీచ్‌’ అని శిఖర్‌ ధావన్‌ చెప్పగా, ‘ మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అంటూ హర్భజన్‌ విషెస్‌ తెలిపాడు. ‘ సో క్యూటీ’ అంటూ డేవిడ్‌ వార్నర్‌ కూడా అభినందనలు తెలియజేశాడు. ఇక బాలీవుడ్‌ నటుడు, నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌తో పాటు బిపాసా బసూ, సునీల్‌ గ్రోవర్‌లు సైతం యువీకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల అబుదాబిలో జరిగిన టీ10 లీగ్‌లో యువరాజ్‌ పాల్గొన్నాడు. మరాఠా అరేబియన్స్‌కు యువరాజ్‌ ప్రాతినిథ్యం వహించగా అతని జట్టు టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ను ఓడించిన మరాఠా అరేబియన్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత యువరాజ్‌ సింగ్‌ దేశవాళీ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. దానిలో  భాగంగా గ్లోబర్‌ టీ20 కెనడా లీగ్‌లో సైతం యువరాజ్‌ పాల్గొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top